తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలంటే ఆలయానికి వెళ్లాల్సిందే. తిరుమల దర్శనం టోకెన్‌, ఆర్టీసీ బస్సు టికెట్‌ కలిపి కొనుగోలు చేసే వెసులుబాటును TSRTC కల్పించింది.

తిరుమల వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతికి వెళుతున్నట్లయితే, మీకు బస్సు టిక్కెట్‌తో పాటు ఆలయ దర్శనానికి టికెట్ కూడా అందుతుంది.

శుక్రవారం నుంచి ఈ సౌకర్యం అమల్లోకి వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఈ ప్యాకేజీని www.tsrtconline.in లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చు.

ప్రతీ రోజూ రూ. 300 దర్శనానికి సంబంధించి వెయ్యి టికెట్లను టీఎస్ ఆర్టీసీ వెబ్ సైట్ నుండి బుక్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. బస్సు టికెట్ తో పాటు అదనంగా రూ. 300 చెల్లించి స్వామివారి దర్శనం టికెట్ ను పొందవచ్చు

మీరు మీ బస్ టిక్కెట్‌తో పాటు మీ దర్శన టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలి. వేర్వేరుగా వాటిని రిజర్వు చేసుకునే వీలుండదు

తిరుమల తిరుపతిలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి వేలాది మంది ప్రజలు వెళుతుంటారు. తాజాగా టీటీడీతో కుదుర్చుకున్న ఒప్పందం ఆర్టీసీకి మేలు చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

టీఎస్ ఆర్టీసీలో రోజు వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంచనుండటంతో తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.