సినిమా ఔత్సాహికులందరూ "లైగర్" చిత్రంపై ఆసక్తి చూపుతున్నారు.
సంచలన నటుడు విజయ్ దేవరకొండ తొలిసారిగా బాక్సర్‌గా తెరపై కనిపించనున్నాడు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు మరియు పాటల కారణంగా సినిమాపై బలమైన బజ్ ఏర్పడింది.
భారీ అంచనాల నడుమ గురువారం (ఆగస్టు 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లైగర్' సినిమా ఎలా ఉందో Review చూద్దాం.
కరీంనగర్‌కు చెందిన లైగర్ (విజయ్ దేవరకొండ) తల్లి, బాలమణి (రమ్యకృష్ణ) అతను మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)లో జాతీయ ఛాంపియన్‌షిప్ గెలవాలని కోరుకుంటుంది.
ఆమె తన కొడుకుకి శిక్షణ ఇవ్వడానికి కరీంనగర్ నుండి ముంబైకి వెళుతుంది. ఆమె ఒక టీ దుకాణాన్ని నిర్వహిస్తుంది మరియు అక్కడ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో లైగర్ కి శిక్షణ ఇప్పిస్తుంది
జీవితంలో ఏ అమ్మాయి జోలికి వెళ్లొదని, ప్రేమలో పడితే మన లక్ష్యాన్ని మర్చిపోతామని చెబుతుంటుంది
అయితే లైగర్ ముంబైకి చెందిన తాన్య (అనన్య పాండే) తో ప్రేమలో పడిపోతాడు .
ఆమె కూడా లైగర్‌ని ప్రేమిస్తుంది కానీ అతను నత్తిగా మాట్లాడటం చూసి ఆమె దూరంగా ఉంటుంది.
ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడంలో లైగర్‌కు ఎవరు సహకరించారు? లైగర్ తన గురువు మైక్ టైసన్‌కు వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అనేదే మిగతా కథ.