గాడ్ ఫాదర్  చిరంజీవి ఫస్ట్ లుక్

గాడ్ ఫాదర్   మోహన్ రాజా దర్శకత్వం వహించిన రాబోయే భారతీయ తెలుగు-భాష పొలిటికల్ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం

ఈ సంవత్సరం ప్రముఖ స్టార్ చిత్రాల్లో ఇది ఒకటి  ఇది మలయాళ చిత్రం లూసిఫర్‌కి రీమేక్

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు నయనతార చిరు చెల్లిగా నటిస్తోంది. సత్యదేవ్ విలన్‌గా నటిస్తున్నాడు

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో చిరంజీవి అదగరొట్టేశాడు. కుర్చీలో కూర్చున్న తీరు, రాజసం ఉట్టి పడుతోన్న విధానం అదిరిపోయింది. 

గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ కోసం చిరంజీవి తనయుడు రామ్ చరణ్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. అంతకుముందు, అతను వేచి ఉన్న gifని ట్వీట్ చేశాడు

మొత్తానికి ఈ సినిమాని దసరా వేడుకల సందర్భంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చిరు బర్త్ డే సందర్భంగా కొన్ని ఎక్సైటింగ్ అప్ డేట్స్ ఇచ్చేందుకు గాడ్ ఫాదర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్‌ సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ని షేర్‌ చేసింది.